ETV Bharat / state

నేతన్నల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు: మంత్రి కేటీఆర్ - కొడకండ్లలో మినీ టెక్స్ టైల్ పార్కు వార్తలు

చేనేత, జౌళిశాఖపై ప్రగతిభవన్‌లో జరిగిన సమీక్షించిన మంత్రి కేటీఆర్​... జనగామ​ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి మినీ పార్క్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారని కేటీఆర్​ తెలిపారు. కొడకండ్లలో నైపుణ్యం కలిగిన వేలాదిమంది నేతన్నలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారని.. పార్క్ ఏర్పాటు చేస్తే వారికి ఉపాధి లభిస్తుందన్నారు.

ktr
ktr
author img

By

Published : Jan 4, 2021, 3:48 PM IST

జనగామ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి మేరకు స్థానిక నేతన్నలకు మరింత ప్రయోజనం కలిగేలా మినీ పార్క్ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొడకండ్లలో నైపుణ్యం కలిగిన వేలాదిమంది నేతన్నలు తమ పని కొనసాగిస్తున్నారని, చాలామందికి సరైన ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారని తెలిపారు. అక్కడ పార్క్ ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని కేటీఆర్ అన్నారు.

20వేల మందికి ఉపాధి

టెక్స్ టైల్ రంగానికి తెరాస ప్రభుత్వం ఇస్తున్న మద్దతు వల్ల అనేకమంది రాష్ట్రానికి తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మంత్రి కేటీఆర్​ చెప్పారు. ప్రగతిభవన్​లో చేనేత, జౌళిశాఖపై జరిగిన సమీక్షలో మినీ టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేటీఆర్​కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. పార్కు ఏర్పాటుతో పరిసర ప్రాంతాల్లోని 20వేల నేతన్నల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని ఎర్రబెల్లి అన్నారు.

ఆ పథకం కొనసాగిస్తాం

చేనేత, జౌళి రంగాలకు ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను సమీక్షించిన కేటీఆర్... నేతన్నల కోసం కొనసాగిస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఇలాగే కొనసాగిస్తామని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలోని పవర్ లూమ్ కార్మికులను ఆదుకునేందుకు ప్రతి సంవత్సరం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న బతుకమ్మ చీరల తయారీ కార్యక్రమాన్ని ఈసారి కూడా కొనసాగిస్తామని మంత్రి తెలిపారు. నేతన్నకు చేయూత కార్యక్రమం ద్వారా కరోనా సంక్షోభ కాలంలో నేతన్నలకు పెద్దఎత్తున ప్రయోజనం కలిగిందని... కాంట్రిబ్యూషన్ మినహాయింపు ద్వారా 25వేల మంది నేతన్నల కుటుంబాలకు రూ.95 కోట్ల మేర లబ్ధి చేకూరిందని వివరించారు.

ఈ కార్యక్రమాన్ని తిరిగి కొనసాగించాలని నేతన్నల నుంచి వస్తున్న విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే ప్రారంభమయ్యేలా చూస్తామని కేటీఆర్ తెలిపారు. రానున్న బడ్జెట్​లో చేనేత, జౌళి రంగాలకు కేటాయించాల్సిన అంశాలకు సంబంధించి పూర్తి కసరత్తు చేసి నివేదిక రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఇదీ చదవండి : జాక్​ మా ఎక్కడ?.. 2 నెలలుగా చైనా బిలియనీర్ అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.