ETV Bharat / state

Valmidi Ramalayam Jangaon : భద్రాద్రిని తలపించేలా వల్మిడి రామాలయం.. చినజీయర్ స్వామి చేతులు మీదుగా విగ్రహ ప్రతిష్ఠాపన

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2023, 8:48 AM IST

Valmidi Ramalayam Jangaon : భద్రాద్రి తరహాలో జనగామ జిల్లాలో రాములోరి గుడి అందుబాటులోకి రానుంది. పాలకుర్తి మండలంలోని వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం అత్యంత సుందరంగా పునర్నిర్మితమైంది. చినజీయర్‌ స్వామి చేతుల మీదుగా ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. ఎర్రబెల్లి దయాకర్‌రావు, హరీశ్‌రావుతో పాటు పలువురు మంత్రులు కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

Rama Temple in Jangaon Pictures
Rama Temple in Valmidi Details
Valmidi Ramalayam Jangaon భద్రాద్రిని తలపించేలా వల్మిడి రామాలయం.. చినజీయర్ స్వామి చేతులు మీదుగా విగ్రహ ప్రతిష్ఠాపన

Valmidi Ramalayam Jangaon : జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. 50 ఎకరాల సువిశాల గుట్టపై శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నయన మనోహరంగా రూపుదిద్దుకుంది. రామాయణాన్ని రచించిన వాల్మీకి కొంతకాలం ఇక్కడ ఉన్నాడని ప్రతీతి. గతంలో అభివృద్ధికి నోచుకోని ఈ ఆలయం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli Dayakar Rao) ప్రత్యేక చొరవతో సర్వాంగ సుందరంగా తయారైంది. రూ.25కోట్లలతో భద్రాచలం గుర్తుకు వచ్చేలా నిర్మించిన ఈ కోవెలకు దాదాపు 10వేల టన్నుల నల్లరాయిని ఉపయోగించారు. కొండపైకి వెళ్లేందుకు మెట్లు, స్వాగత తోరణం, ప్రహరీ, కనమ దారి, భక్తులు సేదతీరేందుకు కుటీరాలు నిర్మించి ఇక్కట్లు తొలగించారు.

Valmidi Ramalayam Jangaon : వల్మిడి రామాలయం.. ఎర్రబెల్లి చొరవతో రామయ్యకు పునర్​వైభవం

Valmidi Ramalayam Opening : వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాద్యాల నడుమ ఇవాళ ఉదయం పది గంటలకు త్రిదండి శ్రీ చినజీయర్‌ స్వామి చేతుల మీదుగా శ్రీ సీతారామచంద్ర స్వామి(Valmidi Sri Seetha Ramachandra Swamy) విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. మంత్రులు ఎర్రబెల్లి, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆలయ నిర్మాణం జరిగిందన్న మంత్రి ఎర్రబెల్లి.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. వల్మిడి, పాలకుర్తి ప్రాంతాలు పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు.

"వాల్మీకి ఈ ప్రాంతంలో ఉండి రామాయాణాన్ని రాశారు. ఇన్నేళ్లు ఈ గుడిని ఎవరు పట్టించుకోలేదు. అత్యంత పురాతనమైన ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. అందుకే ఈ ఆలయంలో సమస్యలు తెలుసుకుని 15 సంవత్సరాల క్రితం లక్ష రూపాయలతో కల్యాణ మండపం కట్టించాను. అనంతరం అవసరమైనప్పుడు నిధులు సమకూరుస్తేనే ఉన్నాను. అయినా ఏదో సమస్య వస్తూనే ఉంది. అందుకే ఈ ఆలయానికి పునర్వైభవం తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. ఈ కోవెలను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించాను. రానున్న రోజుల్లో భద్రాచలంలో ఏ విధంగా కల్యాణం, కార్యకలాపాలు జరుగుతున్నాయో.. అదే విధంగా వల్మిడి ప్రాంతంలో జరగాలనే ఆకాంక్షతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం. చుట్టు పక్కల ప్రాంతం అంతా సుందరంగా తయారు చేస్తున్నాం. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు రోడ్లు నిర్మించాం."- ఎర్రబెల్లి దయాకరరావు, మంత్రి

Rama Temple Full Details in Valmidi : వల్మిడి ఆలయంతో పాటు దారిలోని వంతెన ప్రారంభోత్సవం, పాలకుర్తిలోని కల్యాణ మండపం, స్మృతి వనం మొదలైన అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొననున్నారు. పాలకుర్తి మండలంలోని వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి(Valmidi Ramalayam) దేవాలయం అత్యంత సుందరంగా పునర్నిర్మితమైంది. చినజీయర్‌ స్వామి చేతుల మీదుగా ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు మంత్రులు కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

Nalla Pochamma Temple at Secretariat : సచివాలయ నల్లపోచమ్మ గుడి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు.. సీఎం కేసీఆర్ చేతుల మీదగా ప్రారంభం

Yadadri Temple in Yadadri Bhuvanagiri : యాదాద్రిలో రాజగోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభం

కమనీయం.. కోరమీసాల మల్లన్న కల్యాణం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.