Rare Fish: చదునైన ఆకారంతో, చూడటానికి పాములా కనిపించే ఓ అరుదైన చేప జనగామ జిల్లా పెంబర్తి చెరువులో మత్స్యకారులకు చిక్కింది. ఆ చేపను చూడగానే నిజంగానే పామే అనుకుంటారు. తెలంగాణలో అరుదుగా కనిపించే ఈ రకం చేపను మలుగ(మలుబెండు) అని పిలుస్తుంటారని మత్స్యకారులు తెలిపారు.
మత్స్యకారులకు చిక్కిన ఈ మీనం సుమారు 5 కిలోల బరువు, 5 అడుగుల పొడవు ఉంది. ఈ చేపను చూసేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చేప వద్ద సెల్ఫీలు దిగుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి: