జనగామ జిల్లా కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)జిల్లా నిర్మాణ మహాసభలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని సమస్యలతో పాటు జిల్లాలోని సమస్యలు, అభివృద్ధిపై రావల్సిన నిధులు, పరిశ్రమలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిన ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : ఆర్టీసీ సమ్మెపై కేంద్రం దృష్టి సారించింది: లక్ష్మణ్