జనగామ జిల్లా నర్మెట్టలో ఓ డీసీఎంలో 280 బ్యాగుల్లో 14వేల కిలోల పేలుడు పదార్థాల ముడి సరుకును తరలిస్తున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు సరకుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపకపోవడం వల్ల వాటిని స్వాధీనం చేసుకున్నారు.
పేలుడు పదార్థాల ముడి సరకును అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురిని నర్మెట్ట పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ రవాణాలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఐ సంతోశ్ కుమార్ తెలిపారు.
- ఇవీ చూడండి: నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం.!