ETV Bharat / state

MLA Thatikonda Rajaiah Met KTR : కడియంతో వివాదం ముగిసినట్లే.. ఇక దానిపైనే ఫోకస్‌ - స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

Thatikonda Rajaiah Meet With KTR : తనకు.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించి మంత్రి కేటీఆర్‌ తనను పిలిచి మాట్లాడారని.. ఇంతటితో ఈ వివాదం ముగిసినట్లేనని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. అధిష్ఠానం సూచన మేరకు ఇకపై కడియం గురించి మాట్లాడనని.. నియోజకవర్గంలో పార్టీని పటిష్ఠ పరుస్తానని స్పష్టం చేశారు.

Thatikonda Rajaiah Met KTR
Thatikonda Rajaiah Met KTR
author img

By

Published : Jul 11, 2023, 4:32 PM IST

Updated : Jul 11, 2023, 4:56 PM IST

MLA Thatikonda Rajaiah Meet With Minster KTR : జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఉదయం ప్రగతిభవన్‌కు చేరుకున్న రాజయ్య.. కేటీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు 3 గంటల పాటు ఆయనతో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య వివాదం నడుస్తోన్న నేపథ్యంలో కేటీఆర్‌తో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

కేటీఆర్‌తో సమావేశం అనంతరం ప్రగతిభవన్‌ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ పిలుపు మేరకు కలిసేందుకు వచ్చినట్లు తెలిపారు. కడియం శ్రీహరితో విభేదాల గురించి కేటీఆర్‌ అడిగారని.. కడియం గురించి ఇకపై మీడియా ముందు మాట్లాడవద్దని చెప్పారని తెలిపారు. కేటీఆర్‌ తనను పిలిచి మాట్లాడటంతో సమస్య పరిష్కారమైందన్న ఆయన.. ఇకపై ఘన్‌పూర్‌లో పార్టీని పటిష్ఠ పరుస్తానన్నారు.

ఈ క్రమంలోనే తల్లిని అవమానించే వారు ఎవరూ ఉండరని.. కడియం శ్రీహరి కుల వివాదం ఇప్పటిది కాదని ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యానించారు. మాదిగ దండోరా ద్వారా తాను రాజకీయాల్లోకి వచ్చానని.. మాదిగల అస్తిత్వం కోసం తాను మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. కడియం శ్రీహరి అహంతో మాట్లాడే విధానం సరిగా లేదని.. ఆయన తనను నిత్యం వేధిస్తున్నారని ఆరోపించారు.

మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు కలిసేందుకు వచ్చాను. కడియం శ్రీహరితో విభేదాల గురించి కేటీఆర్‌ అడిగారు. కడియం గురించి ఇకపై మీడియా ముందు మాట్లాడవద్దని చెప్పారు. కేటీఆర్‌ నన్ను పిలిచి మాట్లాడటంతో సమస్య పరిష్కారమైంది. ఇకపై ఘన్‌పూర్‌లో పార్టీని పటిష్ఠ పరుస్తాను. తల్లిని అవమానించే వారు ఎవరూ ఉండరు. కడియం శ్రీహరి కుల వివాదం ఇప్పటిది కాదు. మాదిగ దండోరా ద్వారా నేను రాజకీయాల్లోకి వచ్చాను. మాదిగల అస్తిత్వం కోసం నేను మాట్లాడుతూనే ఉంటాను. కడియం శ్రీహరి అహంతో మాట్లాడే విధానం సరిగా లేదు. కడియం నన్ను నిత్యం వేధిస్తున్నారు. - తాటికొండ రాజయ్య, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పరస్పరం విమర్శలు.. సవాళ్లతో నియోజకవర్గంలో రోజూ హాట్‌ టాపిక్‌గా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం కడియం శ్రీహరి కులం, ఆయన కుటుంబం గురించి.. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. రాజయ్య సంస్కారం సభ్యతతో ఉండాలని, పరిణితి తెచ్చుకోవాలంటూ శ్రీహరి దీటుగా సమాధానమిచ్చారు. తల్లులను అవమానపరిచేలా మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వివాదం రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో మంత్రి కేటీఆర్ నేడు ఎమ్మెల్యే రాజయ్యను పిలిచి మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఇంతటితో ఈ వివాదం ముగిసిందని రాజయ్య స్పష్టం చేశారు.

MLA Thatikonda Rajaiah Met KTR : కడియంతో వివాదం ముగిసినట్లే.. ఇక దానిపైనే ఫోకస్‌

ఇవీ చూడండి..

'నా దగ్గరున్న ఆధారాలు బయటపెడితే ఇంటి నుంచి కూడా బయటకు రాలేవు'

Kadiam Srihari latest comments : 'అవకాశం వచ్చిందని విర్రవీగొద్దు' కాక రేపుతున్న కడియం వ్యాఖ్యలు..

Last Updated : Jul 11, 2023, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.