రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు పెద్దన్నలా వ్యవహరిస్తూ పెళ్లి చేసుకున్న ప్రతి ఆడపిల్లకి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తున్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. మంగళవారం జనగామ జిల్లా చిల్పూర్ మండలకేంద్రంలో 124 మంది లబ్ధిదారులకు ఆయన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.

స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు రూ.కోటి 24 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పథకాన్ని ప్రవేశపెట్టి ఆడపిల్లల వివాహానికి అండగా నిలుస్తున్నారని రాజయ్య అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండిః పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించిన ఈసీ