ETV Bharat / state

ముగిసిన బతుకమ్మ సంబురాలు... వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య - జనగామ జిల్లా వార్తలు

తంగేడుపూల తన్మయత్వం.. సీత జడ సిరిసంపద.. గునుగుపూల నిగారింపు.. కట్ల పూల కమనీయ దృశ్యాలతో పల్లెల్లో బతుకమ్మ సంబురాలు ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు తెలంగాణ సంస్కృతి వాడవాడల్లో వెల్లివిరిసింది. ఒక్కొక్క పువ్వుతో సాగిన బతుకమ్మ వేడుకలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు పడతుల చప్పట్లు.. చిన్నారుల కేరింతల మధ్య జనగామలో బతుకమ్మ సంబురాలు ముగిశాయి.

MLA Rajaiah Participated in Bathukamma Celebrations
ముగిసిన బతుకమ్మ సంబరాలు..వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య
author img

By

Published : Oct 25, 2020, 9:20 AM IST

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో శనివారం పూల పండగతో పుడమి పులకరించింది. తొమ్మిది రోజుల పాటు సంబరంగా సాగిన పూల జాతర ముగిసింది.

ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ పాడుతూ మహిళలు బతుకమ్మను నిమజ్జనం చేశారు. వచ్చే ఏడాది బతుకమ్మ జాతరను ఘనంగా జరుపుతామని.. కరోనా మహమ్మారిని నుంచి కాపాడాలంటూ మొక్కులు చెల్లించుకున్నారు. స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఉత్సవాల్లో పాల్గొని.. బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఇదీ చూడండి:దేశంలో వైద్య విద్య సంపన్న వర్గాలకే పరిమితమైంది: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.