మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి ఘనస్వాగతం పలికారు.
పాలకుర్తి దేవస్థానాన్ని రూ.15 కోట్లతో అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆక్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేములవాడ, యాదాద్రి, పాలకుర్తి వంటి దేవస్థానాలకు ఎన్నో నిధులు కేటాయించి, అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు.
ఇవీ చూడండి: డీసీసీబీ పాలకవర్గాల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ