కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దంపతులు దర్శించుకున్నారు. కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో అఖండ జ్యోతి ప్రజ్వలన చేశారు. అఖండ జ్యోతిని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఇదీ చదవండిః కలికాలమంటే ఇదేనేమో.. నదీ ఒడ్డునే ఇసుక విక్రయం