ETV Bharat / state

దైవ మార్గమే శాంతి, సమానత్వానికి చిహ్నం: కడియం

క్రైస్తవం అంటే మతం కాదని ఒక మంచి మార్గమని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా జఫర్​గఢ్​ మండలం ఉప్పుగల్లు గ్రామంలో నిర్వహించిన మినీ క్రిస్మస్​ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

mini christmas celebrations started by kadiyam srihari in jangaon dist
దైవ మార్గమే శాంతి, సమానత్వానికి చిహ్నం : కడియం
author img

By

Published : Dec 19, 2020, 5:12 PM IST

ప్రతి ఒక్కరూ మంచిమార్గంలో పయనించి సమాజ శ్రేయస్సుకు కృషిచేయాలని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా జఫర్​గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో నిర్వహించిన మినీ క్రిస్మస్ వేడుకలను ఆయన ప్రారంభించారు.

దేవుని ఆశీర్వాదంతో ప్రజలంతా సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రీస్తు జన్మించిన, శిలువ వేసిన ప్రదేశాలను సందర్శించి తాను ముక్తి మార్గంలో ప్రయాణించినట్లు తెలిపారు. చర్చి నిర్మాణానికి తన వంతు సహాయంగా లక్ష రూపాయలను త్వరలో అందించనున్నట్లు వెల్లడించారు. సమాజంలో శాంతి, సమానత్వం పొందాలంటే ప్రతి ఒక్కరు యేసయ్య మార్గంలో నడవాలన్నారు.

ఇదీ చూడండి:దొంగ రిజిస్ట్రేషన్లకు ధరణి స్వర్గధామం: మురళీధర్​ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.