తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు జనగామలో నిర్వహించడం జిల్లాకే గర్వకారణమన్నారు. ధర్మకంచ మినిస్టేడియంలో కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి 46వ కబడ్డీ పోటీలను కడియం శ్రీహరి, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీష్ యాదవ్ ప్రారంభించారు.
కబడ్డీ పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి బాలబాలికల 66 టీంలుగా పాల్గొంటున్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర టీంకు ఎంపిక చేసి వచ్చే నెల హరియాణాలో జరిగే జాతీయ పోటీలకు శిక్షణ ఇస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీష్ యాదవ్ తెలిపారు.
ఇదీ చదవండి: నిరసనకారులకు 'కారం'తో సామాన్యుడి జవాబు!