ETV Bharat / state

Gurukula Degree colleges: డిగ్రీకి వచ్చినా నేలమీదే.. గురుకులాల్లో కనీస సౌకర్యాలు లేక అవస్థలు

Gurukula Degree colleges: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గురుకులాలకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. గురుకులాల్లో కనీస సౌకర్యాలు కరవవుతున్నాయి. కేజీ టూ పీజీ విద్యలో పేదలకు ఉచిత విద్య, పౌష్టికాహారంతో కూడిన వసతి కల్పిస్తున్నా ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో బాలారిష్టాలు తప్పడం లేదు. ప్రైవేటు భవనాలు అందుబాటులో లేకపోవడంతో ఉన్నచోటనే సొసైటీలు సర్దుబాటు చేస్తున్నాయి. తలుపుల్లేని కిటికీలు, నేలపై నిద్ర, ఇరుకు గదులతో కూడిన అద్దె భవనాల్లో పాఠశాలలు కొనసాగుతున్నాయి

Gurukula Degree colleges
జనగామలో ఐదేళ్ల క్రితం ప్రైవేటు భవనంలో ఏర్పాటైన గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాల
author img

By

Published : Dec 18, 2021, 4:29 AM IST

Gurukula Degree colleges:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గురుకులాలకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. కేజీ టూ పీజీ విద్యలో పేదలకు ఉచిత విద్య, పౌష్టికాహారంతో కూడిన వసతి కల్పిస్తున్నా ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో బాలారిష్టాలు తప్పడం లేదు. మూడు, నాలుగేళ్ల క్రితం పాఠశాలలుగా ప్రారంభమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ అయినా విద్యార్థుల సంఖ్య మేరకు వసతి సౌకర్యాలు పెరగడం లేదు. ప్రైవేటు భవనాలు అందుబాటులో లేకపోవడంతో ఉన్నచోటనే సొసైటీలు సర్దుబాటు చేస్తున్నాయి. కరోనా పొంచి ఉన్నప్పటికీ.. భౌతికదూరం పాటించే పరిస్థితుల్లేవు. ఒకేగదిలో తరగతులు.. అక్కడే బసతో ఇబ్బందులు పడుతున్నారు. తలుపుల్లేని కిటికీలు, నేలపై నిద్ర, ఇరుకు గదులతో కూడిన అద్దె భవనాల్లో పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఇంటర్‌ కళాశాలలుగా ఉన్నతీకరించిన గురుకులాల్లో నేటికీ ఐదు, ఆరు, ఏడు తరగతులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కాలేదు.

పాత దుస్తులతో తరగతులకు..

గురుకుల పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నేటికీ యూనిఫామ్‌ (మూడు జతలు) అందలేదు. గతేడాది ఇచ్చిన పాత దుస్తులనే విద్యార్థులు వినియోగిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ముందస్తుగా దుస్తులకు ఆర్డర్లు ఇవ్వలేదు. పాఠశాలలు ప్రారంభమైన రెండునెలలకు ఇటీవల దుస్తులు కుట్టేందుకు టెండర్లు పిలిచారు. ‘‘ప్రస్తుతానికి గత ఏడాది వచ్చిన దుస్తులను విద్యార్థులకు సర్దుబాటు చేశాం. ఈ ఏడాది ఎవరికీ రాలేదు. పిల్లలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం’’ అని ఎస్సీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. ఈఏడాదికి విద్యార్థులకు కాస్మొటిక్‌ ఛార్జీలు చెల్లించకపోవడంతో సబ్బులు, నూనె, షాంపూ తదితర వస్తువులకు కష్టాలు తప్పడం లేదు. పెరిగిన వస్తువుల ధరల మేరకు ఛార్జీలు పెంచలేదు. సొసైటీల వారీగా పదోతరగతి విద్యార్థులకు నెలకు రూ.50, బాలికలకు రూ.75, జూనియర్‌ కళాశాల విద్యార్థులకు నెలకు రూ.90 నుంచి 120గా ఉంది. ఈ ఏడాది ఎస్సీ గురుకులాల్లో డిపార్ట్‌మెంట్‌ స్టోర్ల విధానం కనుమరుగైంది. గిరిజన గురుకులానికి గిరిజన సహకార సొసైటీ (జీసీసీ) వస్తువులను అందించాల్సి ఉన్నప్పటికీ నేటికీ మొదలు కాలేదు. బీసీ గురుకుల పాఠశాలల విద్యార్థులకు ఇంకా చెల్లింపులు జరగలేదు. మైనార్టీ గురుకుల సొసైటీలో మూణ్నెళ్లకు కిట్లు పంపిణీ చేస్తున్నా వస్తువులు నెలరోజులకే సరిపోవడం లేదు.

ప్రైవేటు భవనాలు.. కోట్లలో అద్దెలు..

పక్కా భవనాలున్న గురుకులాలు, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలను మినహాయిస్తే మిగతా చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. పక్కా భవనాల కోసం ఒక్కో పాఠశాలకు 10 ఎకరాల చొప్పున స్థలాన్ని కేటాయించినా నిర్మాణాలు మొదలుకాలేదు. కానీ ఒక్కో భవనానికి సొసైటీలు నెలకు చదరపు అడుగుకు రూ.10 నుంచి రూ.15 చొప్పున రూ.8 లక్షలవరకు అద్దె కడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ సొసైటీలో 150 పాఠశాలలు, బీసీ సొసైటీలో 238, మైనార్టీ సొసైటీలో 180 పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఘట్‌కేసర్‌ మండలంలోని అంకుషాపూర్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాల భవనంలో అరకొర వసతులతో దాదాపు 1500 మంది విద్యార్థినులతో ఇబ్రహీంపట్నం, మహేంద్రహిల్స్‌, బుద్వేల్‌ గురుకుల డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి. ఉతికిన బట్టలను తరగతి గదుల్లోనే ఆరేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జనగామలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో కొనసాగుతున్న గిరిజన డిగ్రీ కళాశాల, మైనార్టీ జూనియర్‌ కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం ప్రతి పది మంది విద్యార్థులకు ఒక స్నానాల గది, మరుగుదొడ్డి ఉండాల్సి ఉన్నా.. 40 మందికి ఒకటి చొప్పున సర్దుకోవాల్సి వస్తోంది.

ప్రత్యక్ష బోధన ఎప్పుడు?

మైనార్టీ సొసైటీలోని 204 గురుకుల పాఠశాలల్లో 5, 6, 7 తరగతులకు ఆన్‌లైన్‌లోనే బోధనే సాగుతోంది. పాఠశాలలన్నీ జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ కావడంతో 8వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు మాత్రమే ప్రత్యక్ష బోధన కొనసాగిస్తున్నారు. బీసీ సొసైటీలో వసతి సౌకర్యం లేని కొన్ని పాఠశాలల్లో 5, 6 తరగతుల విద్యార్థులకూ ఆన్‌లైన్లోనే బోధన కొనసాగిస్తున్నారు. అయితే హాజరు 20 శాతానికి మించడంలేదు. స్మార్ట్‌ఫోన్‌ లేకపోవడం, డేటాకు డబ్బుల్లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ‘‘5,6,7 తరగతులకు ఆన్‌లైన్‌ బోధన జరుగుతోంది. తల్లిదండ్రులు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కొందరికి డేటా ఛార్జీలకు డబ్బులేక ఇబ్బందులు పడుతుంటే ఉపాధ్యాయులు రీఛార్జి చేస్తున్నారు.’’ అని ఒక మైనార్టీ పాఠశాల ప్రిన్సిపల్‌ తెలిపారు. పక్కాభవనాలున్న మైనార్టీ పాఠశాలలో తరగతులు నిర్వహించేందుకు అవకాశమున్నా చేయడం లేదు. ‘‘పాఠశాలల వారీగా నిర్మిత స్థలం, విద్యార్థుల వివరాలు తీసుకుంటున్నాం. వసతి సౌకర్యంపై స్పష్టత వచ్చిన తరువాత 5-7 విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభిస్తాం’’ అని మైనార్టీ సొసైటీ అదనపు కార్యదర్శి లియాఖత్‌ తెలిపారు.

ఇది జనగామలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో కొనసాగుతున్న మైనార్టీ గురుకుల పాఠశాల-జూనియర్‌ కళాశాల. 5, 6, 7 తరగతులను మినహాయిస్తే 480 మంది విద్యార్థులున్నారు. భౌతిక దూరం పాటించే పరిస్థితులు లేకపోవడంతో విద్యార్థులు డార్మెటరీలో ఒకేచోట ఇలా ఇరుకిరుకుగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

వరంగల్‌ జిల్లా ఉర్సుగుట్టలోని బీసీ బాలికల గురుకులం ఉన్నతీకరణలో భాగంగా జూనియర్‌ కళాశాలగా మారింది. పెరిగిన విద్యార్థుల సంఖ్య మేరకు అక్కడ వసతి లేదు. దాంతో ఈ పాఠశాలలో ఐదు, ఆరు తరగతులకు నేటికీ ప్రత్యక్ష బోధన ప్రారంభం కాలేదు. పాఠశాలకు దూరంగా ఉన్న ఖాళీస్థలాన్ని ఇలా ఆటలకు వినియోగిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.