జనగామలోని షెడ్యూలు కులాల జిల్లా అభివృద్ధి శాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. కార్యాలయంలో పనిచేసిన అటెండర్ రెనుకుంట్ల ఐలయ్య 2 నెలల క్రింద పదవీ విరమణ పొందాడు. ఐలయ్యకు రావాల్సిన రిటైర్మెంట్ డబ్బులకు సంబంధించిన ఫైల్స్‌పై సంతకాలు చేసేందుకు అధికారి గట్టుమల్లు, సూపరింటిండెంట్ ఖదీర్... రూ. 10వేలు డిమాండ్ చేశారు.
లంచం ఇచ్చుకొనని బాధిత వ్యక్తి ప్రాధేయపడగా... రూ. 5 వేలకు బేరం కుదుర్చుకున్నారు. లంచం ఇచ్చేందుకు మనసొప్పని ఐలయ్య... అనిశాను ఆశ్రయించాడు. మొత్తం విషయాన్ని వివరించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బులు స్వాధీనం చేసుకుని.... కేసు నమోదు చేశారు.