మృగశిర కార్తె సందర్భంగా జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో ప్రజలు పెద్ద ఎత్తున చేపల కొనుగోళ్లు చేస్తున్నారు. మత్స్యకారులు మండల కేంద్రంలోని జలాశయం నుంచి చేపలు పట్టుకొస్తూ... అమ్ముకుంటున్నారు. మృగశిర కార్తె సందర్భంగా చేపల ధరతో పాటు విక్రయాలు పెరిగిపోయాయి.
కొందరయితే జలాశయం వద్దకే వెళ్లి చేపలను కొనుక్కుంటున్నారు. కొనుగోలు దారులతో జలాశయం వద్ద సందడి నెలకొంది. ఒక్కో చేప 20 కిలోల చొప్పున ఉండటం వల్ల కొనుగోలుదారులు వాటిని ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఇవీ చూడండి: కరోనాపై పోరులో... స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష