జనగామ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు... భాజపా నేతలు నిత్యావసరాలు పంపిణీ చేశారు. స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపు వందమందికి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు నేతలు తాళ్లపల్లి సాగర్, ఎన్నారై అనిల్ రెడ్డి తెలిపారు.
లాక్డౌన్ కారణంగా ఎంతోమంది మధ్యతరగతి కుటుంబీకులు రోడ్డున పడ్డారని సాగర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వేతనాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటం వల్లే తాము ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఈనెల 16న కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం