గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సరఫరా చేసే తాగునీటినే పరీక్షించేవారు. మిషన్ భగీరథ పథకానికి అనుసంధానంగా ఏర్పాటు చేసిన ప్రయోగశాలల్లోనూ ఇప్పుడు పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 78 ప్రయోగశాలల్లో 16 రకాల పరీక్షలను కేవలం రూ.600కే చేస్తున్నారు. ఇందుకు అర లీటరు నుంచి లీటరు నీటిని తీసుకొచ్చి తగిన రుసుము డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ సబ్ డివిజన్ మిషన్ భగీరథ పథకం ఉప కార్యనిర్వాహక ఇంజినీరు (డీఈ) కరుణ్‌కుమార్ తెలిపారు.
అత్యధిక పరీక్షల నిర్ధారణకు ఒకరోజు సరిపోతుందన్నారు. ఒకటి, రెండు పరీక్షల ఫలితాలు మాత్రం రెండోరోజు అందించేలా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అన్ని పరీక్షల ఫలితాలు ఒకేసారి కావాలంటే రెండోరోజు అందిస్తామన్నారు. ప్రతి తాగునీటి వనరును ఏడాదికోసారి పరీక్షించుకోవాలని ఆయన సూచించారు.
ఇవీ చూడండి: ఇక నుంచి వారంలో ఒకసారి మాత్రమే కేసుల వెల్లడి