ETV Bharat / state

జిల్లాలో రోజుకు 1150 ర్యాపిడ్‌ టెస్టులు : కలెక్టర్ నిఖిల - కరోనా ర్యాపిడ్ టెస్టులు

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లాలో ర్యాపిడ్​ టెస్టుల సంఖ్యను భారీగా పెంచనున్నట్టు జనగామ జిల్లా కలెక్టర్​ నిఖిల తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో రోజుకు 1150 టెస్టులు నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు.

Daily 1150 Corona Rapid Tests Will Does In District Hospitals Says Jangoan Collector
జిల్లాలో రోజుకు 1150 ర్యాపిడ్‌ టెస్టులు : కలెక్టర్ నిఖిల
author img

By

Published : Aug 24, 2020, 9:40 AM IST

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వాదేశాల మేరకు.. మహబూబాబాద్​ జిల్లాలో ర్యాపిడ్ యాంటిజెన్​ పరీక్షల సంఖ్యను పెంచనున్నట్టు జిల్లా కలెక్టర్​ నిఖిల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో రోజుకు 1150 ర్యాపిడ్ యాంటిజెన్​ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు. జిల్లా, మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోజుకు 50, ప్రాంతీయ ఆస్రత్రుల్లో 100, జిల్లా ఆస్పత్రుల్లో 200 పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు.

ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా పరీక్షలు నిరాటంకంగా కొనసాగుతాయని కలెక్టర్​ అన్నారు. ఎక్కువసంఖ్యలో పరీక్షలు చేయడం వల్ల వ్యాధిగ్రస్థులను త్వరగా గుర్తించి ఐసోలేషన్​లో ఉంచితే.. వ్యాధి సంక్రమణను ఆపవచ్చన్నారు. హోం ఐసోలేషన్​లో ఉండేవారికి వైద్యాధికారులు తగు వైద్య సహాయం, సలహాలు అందిస్తారని తెలిపారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవలని సూచించారు.

ఇదీ చూడండి : విఫలమవడానికి గల కారణాలపై కమిటీ వేశాం : జెన్‌కో సీఎండీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.