లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అదేవిధంగా విలేకరులు కూడా ఆపద సమయంలో ధైర్యంగా పని చేస్తూ ప్రజలకు సమాచారం అందిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో స్థానిక నియోజకవర్గంలో పనిచేస్తున్న పాత్రికేయులకు బియ్యంతో పాటు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని, మాటలతో కాలం గడుపుతున్నారని ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. ఇంటికొకరి చొప్పున కరోనా పరీక్షలు చేయాలని కోరారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదని, వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని తెచ్చిన వెంటనే కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.
ఇవీ చూడండి: 'జీవో నెంబర్ 3ను కాపాడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి'