ETV Bharat / state

cm kcr visits Jangaon: జనగామలో కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ - ts news

cm kcr visits Jangaon: జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. యశ్వంతాపూర్‌ వద్ద నిర్మించిన జిల్లా పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కేసీఆర్ రాకతో పట్టణమంతా గులాబీమయమైంది.

cm kcr visits Jangaon: జనగామలో సమీకృత కలెక్టరేట్​ను ప్రారంభించిన ముఖ్యమంత్రి

author img

By

Published : Feb 11, 2022, 1:43 PM IST

Updated : Feb 11, 2022, 3:07 PM IST

cm kcr visits Jangaon: జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటిస్తున్నారు. ప్రజలకు సౌకర్యవంతమైన సేవలందించేందుకు ఒకేచోట ఏర్పాటు చేసిన సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్​ ప్రారంభించారు. సూర్యాపేట రోడ్డులో మూడేళ్ల క్రితం ఈ భవనానికి శంకుస్ధాపన చేయగా.. అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

సకల సౌకర్యాలు

జనగామలోని సూర్యాపేట రహదారిలో 25 ఎకరాల్లో 58.20 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మూడు అంతస్తుల్లో అన్ని హంగులతో విశాలంగా నిర్మించారు. సుమారు 2 లక్షల 17 వేల 468 చదరపు ఫీట్లు గల ఈ సమీకృత కలెక్టర్ కార్యాలయంలో 34 శాఖలు కొలువుదీరనున్నాయి. కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్​, ఇద్దరు అదనపు కలెక్టర్ల ఛాంబర్లు, డీఆర్​వో ఛాంబర్లు, కలెక్టరేట్ స్టాఫ్ హాల్ , స్టేట్ ఛాంబర్, స్టాఫ్ రూమ్, విశ్రాంతి గది, రెండు వెయిటింగ్ హాళ్లు, 25 మందికి సరిపోయే మినీ కాన్ఫరెన్స్ హాల్, 32 మందికి సరిపోయే కాన్ఫరెన్స్ హాల్, 250 మంది పెట్టె మీటింగ్ హాల్ ఉన్నాయి. 4 లిఫ్ట్​లు, అత్యవసర ద్వారాలు, హెలిపాడ్, 200 కార్లు పట్టే విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు మరెన్నో సౌకర్యాలున్నాయి.

గులాబీమయం..

అనంతరం ముఖ్యమంత్రి యశ్వంతాపూర్‌ వద్ద నిర్మించిన జిల్లా పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. జిల్లా పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవ్వనున్న సీఎం... తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సభ కోసం తెరాస శ్రేణులు భారీగా జనసమీకరణ చేశారు. సుమారు లక్షకు పైగా ప్రజలు హాజరైనట్లు సమాచారం. ముఖ్యమంత్రి రాకతో జనగామ పట్టణ పరిసరాలు పూర్తిగా గులాబీమయమయ్యాయి. కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ.... పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.

ప్రజల్లో ఉత్కంఠ..

ఇటీవల కొత్త రాజ్యాంగం అవసరమంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై భాజపా నిరసనలు చేపట్టింది. అనంతరం రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని వ్యాఖ్యలు దుమారం రేపగా... రాష్ట్రవ్యాప్తంగా తెరాస శ్రేణలు ఆందోళన చేశాయి. ఈ క్రమంలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది. సభలో సీఎం ఏ విధంగా స్పందిస్తారోననే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.

ఇదీ చదవండి:

Last Updated : Feb 11, 2022, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.