జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామ శివారులోని క్రాస్ రోడ్స్ వద్ద అదుపుతప్పి కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న పాలకుర్తి మండల వైద్య అధికారిణి ప్రియాంకకు స్వల్ప గాయాలయ్యాయి.
ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. వెంటనే స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ప్రియాంక పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేస్తున్నారు.
ఇదీ చూడండి: Accident: లారీ బోల్తా.. క్యాబిన్లో ఇరుక్కున్న ముగ్గురు