గాంధీజీ ఆశయాల సాధన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాల తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్‌లో భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన గాంధీ సంకల్పయాత్రను ఆయన ప్రారంభించారు. సంకల్పయాత్రలో భాగంగా జిల్లా కేంద్రంలోని విధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక బస్టాండ్ ఆవరణలో స్వచ్ఛ భారత్‌లో పాల్గొని శుభ్రం చేశారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం, స్వచ్ఛత కోసం భాజపా చేస్తున్న కృషికి ప్రజల్లో మంచి స్పందన ఉందని కేంద్రమంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లపై చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?