జనగామ జిల్లా యశ్వంతపూర్ జనగామ ఫార్మసీ కలశాలలో బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరుపుకున్నారు. విద్యార్థులు సంప్రదాయం ఉట్టిపడేలా దుస్తులు ధరించి తీరొక్క పూలతో కళాశాలకు చేరుకున్నారు. అనంతరం రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి ఉపాధ్యాయులతో కలిసి ఆడిపాడారు. డీజే పాటలకు నృత్యాలు చేస్తూ తోటి స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపారు.
ఇవీ చూడండి: జంటనగరాల్లో భారీవర్షం... ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం