జగిత్యాల జిల్లా మెట్పల్లిలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగ్గుల పోటీ నిర్వహించారు. ఓ వైపు పండుగ విశిష్టతను తెలుపుతూనే.. మరోవైపు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు.
అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి వాటి చుట్టూ ఓటరు అవగాహన కల్పించేలా వివిధ సూక్తులు రాశారు. ఓటర్లలో మార్పు తెచ్చేందుకు విద్యార్థులు చేసిన కృషిని అధ్యాపకులు అభినందించారు.