ETV Bharat / state

కరోనా విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా లేదు: ఉత్తమ్​

కరోనా విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు ప్రమాదకరంగా ఉన్నాయని పీసీసీ చీఫ్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆరోపించారు. అత్యధిక కేసులు నమోదైన తర్వాత పరీక్షలు తగ్గించారని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అసమర్థతా లేక నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. జగిత్యాలలో ఇవాళ ఆయన పర్యటించారు.

కరోనా విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా లేదు: ఉత్తమ్​
కరోనా విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా లేదు: ఉత్తమ్​
author img

By

Published : May 21, 2020, 2:34 PM IST

కరోనా విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉండట్లేదని పీసీసీ చీఫ్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లాకేంద్రంలో ఆయన ఇవాళ పర్యటించారు. వైరస్​ విషయంలో రాష్ట్రంలో ప్రమాదకర విధానాలు అవలంభిస్తున్నారని ఆరోపించారు. అత్యధిక కేసులు నమోదైన తర్వాత పరీక్షలు తగ్గించారన్నారు. ఐసీఎంఆర్‌ ఆమోదించిన ప్రైవేటు ఆస్పత్రుల్లో 28 రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడించారు. తెలంగాణలో మాత్రం ప్రైవేటు ఆస్పత్రుల్లో పరీక్షలు అనుమతించట్లేదని ఉత్తమ్​ వివరించారు.

"రాష్ట్ర ప్రభుత్వం అసమర్థతా లేక నిర్లక్ష్యమా అర్థం కావట్లేదు. తెలంగాణలో అన్ని విషయాల్లోనూ కేసీఆరే నిపుణుడు. పారాసెటమాల్‌ వేసుకుంటే కరోనా పోతుందని కేసీఆర్‌ చెప్పారు. ఎక్కువగా పరీక్షలు చేస్తే నియంత్రించవచ్చని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది."

-ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, పీసీసీ చీఫ్​

కరోనా విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా లేదు: ఉత్తమ్​

ఇదీ చూడండి: పెట్రోల్​ బంక్​ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.