ETV Bharat / state

బాధితులకు ఇంకా అందని పరిహారం.. మానని గాయం

రెప్పపాటులో ముంచుకొచ్చిన ముప్పు..! కళ్లు తెరిచి చూసేలోగా జీవచ్ఛవాలుగా మారిన ప్రయాణీకులు..! జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాదం దృశ్యాలు తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుంది. ఏడాది గడుస్తున్నా... ఆ నెత్తుటి జ్ఞాపకాలు గుండెల్ని మెలిపెడుతూనే ఉన్నాయి..! ఆర్టీసీ చరిత్రలో ఘోరమైన బస్సు ప్రమాదం ఇదే..! ఏకంగా 65 మంది ప్రాణాలు బలిగొన్న ఈ ఉదంతం తాలూకు వేదన...ఇప్పటికీ బాధితుల కళ్లళ్లో కనిపిస్తోంది.

బాధితులకు ఇంకా అందని పరిహారం.. మానని గాయం
author img

By

Published : Sep 10, 2019, 9:27 PM IST

కొండగట్టు అంజన్న సాక్షిగా ఏడాది క్రితం మహా విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఘాట్‌రోడ్డుపై నుంచి ఆర్టీసీ బస్సు కిందికి వస్తూ... అదుపు తప్పి ఘోర ప్రమాదానికి గురైంది. బస్సులో ఇరుక్కుపోయి చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతున్న వారికి ఆపన్నహస్తం అందించి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చాలా మంది ఒకే గ్రామానికి చెందిన వారైనా.. వరుసగా పేర్చిన మృతదేహాల్లో తమవారు ఎక్కడున్నారో వెతుక్కోవడం కలచివేసింది. మృతుల్లో ఎక్కువ మంది రెక్కాడితే గానీ డొక్కాడని పేదలే. భక్తి భావంతో ఉప్పొంగాల్సిన కొండగట్టు...ఈ ప్రమాదంతో కొండంత విషాదం మూటగట్టుకుంది.

ఈ బస్సులో కోనాపూర్‌, తిర్మలాపూర్‌, శనివారంపేట, రాంసాగర్‌, హిమ్మత్‌రావుపేట, డబ్బు తిమ్మాయిపల్లి గ్రామాల ప్రజలు జగిత్యాలకు వెళ్తుంటారు. వాస్తవానికి డబ్బుతిమ్మాయిపల్లి నుంచి కుడివైపు తిరిగి దొంగలమర్రి క్రాస్‌రోడ్డు మీదుగా జగిత్యాలకు వెళ్లే ఆస్కారం ఉంది. కానీ ఆర్టీసీ అధికారులు రాబడి పెంచుకొనేందుకు బస్సును కొండగట్టు మీదుగా మళ్లించారన్న ఆరోపణలున్నాయి. ఆయా గ్రామాల్లో ప్రయాణికులు ఎక్కకపోయినా కొండగట్టు ప్రయాణికులతో నష్టం నివారించుకోవచ్చని భావించటమే ఇందుకు కారణం.

బస్సు కాలం చెల్లింది కావటం, బ్రేక్‌ ఫెయిల్ అవటం వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక విచారణలో నిర్ధరించారు. 2007 మోడల్‌కు చెందిన ఆర్టీసీ బస్సు జీవితకాలంలో 12 లక్షల కిలోమీటర్లు తిరగాల్సి ఉండగా.. ప్రమాదానికి గురైన బస్సు మాత్రం 14 లక్షల 95 వేల 116 కిలో మీటర్లు తిరిగిందని తేల్చారు. 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత బస్సును తుక్కు కింద పక్కకు పడేయాలి. కానీ...ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం ఇంత మంది ప్రాణాలు తీసింది.

ఘాట్‌రోడ్డులో ఇంధన పొదుపులో భాగంగా ఇంజిన్‌ న్యూట్రల్‌ చేయడం అదే సమయంలో సరిగ్గా బ్రేక్‌ వేయడానికి వీలుపడకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని తేల్చేశారు. తుక్కుగా పక్కన పెట్టాల్సిన బస్సును ఘాట్‌ రోడ్డులో నడపడమే కాక అందులో 120మంది ప్రయాణికుల్ని ఎక్కించారు. ఘాట్ రోడ్డు పైనుంచి బస్సు మరో నిమిషంలో ప్రధాన రహదారిపైకి వస్తుందనగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఒక్కసారిగా 30 అడుగుల లోయలోకి పడిపోవడం వల్ల మృతుల సంఖ్య భారీగా నమోదైంది. ఘటనా స్థలంలోనే 26 మంది చనిపోగా ఆ మృతుల సంఖ్య చివరికి 65కు చేరింది.

ఈ దుర్ఘటన బాధితుల కుటుంబాల్లో పెను విషాదం మిగిల్చింది. ఒక్కో కుటుంబంలో ముగ్గురు, నలుగురు వ్యక్తుల వరకు మృత్యువాతపడ్డారు. అంతా నిరుపేదలు. ఈ ప్రమాదం జరిగి ఏడాది పూర్తవుతున్నా ఆ గాయాలు ఇంకా మానలేదు. తమ వాళ్లు చనిపోయిన సమాచారం తెలుసుకోవడానికే నెలల సమయం పట్టిందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఆ గ్రామాల్లో ఇప్పటికీ నిశ్శబ్దమే అలుముకుని ఉంది. తల్లిదండ్రులను కోల్పోయిన వారు కన్నకొడుకును అటు తల్లిని పోగొట్టుకుని అనాథలుగా మిగిలిన వారు ఆ ప్రమాదం మిగిల్చిన దు:ఖం నుంచి తేరుకోలేక పోతున్నారు.

మృతుల్లో నిండు గర్భిణి కూడా ఉంది. ఆమె తన భర్త, మరో బంధువుతో కలిసి ప్రసవం కోసం జగిత్యాల ఆస్పత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భార్యతో పాటు అత్తమ్మ, తల్లిని కోల్పోయి ఈ వ్యక్తి ఇద్దరు పిల్లలను చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంటికి పెద్ద దిక్కు లేక బతుకు దుర్భరంగా ఉందని మరి కొందరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ప్రమాదానికి కారణమైన జగిత్యాల డిపో మేనేజర్‌పై సస్పెన్షన్‌ తొలగించి విధుల్లోకి తీసుకున్నారు. బస్సు ప్రమాదం తరవాత బస్సు వెళ్లే దారిని దొంగలమర్రి చెక్‌పోస్టు మీదుగా ఆర్టీసీ అధికారులు మార్చేశారు. ప్రమాద స్థలంలో సిమెంట్ గోడ నిర్మించారు. చిన్న వాహనాలు మాత్రమే పైకి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. దిగేందుకు ఈ మార్గాన కాకుండా మరో దారిలో వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఘాట్ రోడ్డు 4వరసల రహదారి చేయాలన్న ప్రతిపాదన మాత్రం ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇది కార్యరూపం దాల్చితే...ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అయ్యే అవకాశం ఉండదు. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టాలని పలువురు బాధితులు కోరుతున్నారు.

బాధితులకు ఇంకా అందని పరిహారం.. మానని గాయం
ఇదీ చూడండి: కొండగట్టు వెళ్లే బస్​లో 125మంది... సీజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.