వాహనదారులకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించేందుకు జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూశర్మ.. జిల్లాకేంద్రంలోని ధరూర్ క్యాంపులో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేశారు. సిగ్నల్స్‌కు సంబంధించిన 50 రకాల సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేసిన ఈ పాఠశాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించనున్నారు. వేగంతో వెళితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలిపేందుకు దిల్లీ నుంచి తీసుకొచ్చిన నాలుగున్నర లక్షల ద్విచక్రవాహనాన్ని అందుబాటులో ఉంచారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఈ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేశామని వివరించిన జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూశర్మతో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇవీ చూడండి: కండక్టర్ సురేందర్ భౌతికకాయానికి పలువురు నేతల నివాళి