ETV Bharat / state

జగిత్యాలలో ఐదేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్​

జగిత్యాల జిల్లాలో ఐదేళ్ల బాలునికి కరోనా సోకింది. అతన్ని గాంధీకి తరలించగా.. కుటుంబసభ్యులు, అనుమానితులు మొత్తం 10 మందిని కొండగట్టు జేఎన్టీయూలోని క్వారంటైన్​ హోంకు తరలించారు. ఇదిలా ఉండగా వ్యాధి వెలుగు చూసిన గ్రామంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

third corona positive case in jagityal district
జగిత్యాలలో ఐదేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్​
author img

By

Published : Apr 16, 2020, 4:38 PM IST

జగిత్యాల జిల్లా ఐదేళ్ల బాలునిపై కరోనా పంజా విసిరింది. వ్యాధి సోకినట్లు జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్​ నిర్ధరించగా.. అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని కుటుంబసభ్యులు, అనుమానితులు మొత్తం పది మందిని కొండగట్టు జేఎన్టీయూ క్వారంటైన్​ హోంకు తరలించారు. ఇదిలా ఉండగా వ్యాధి వెలుగు చూసిన గ్రామానికి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. గ్రామంలో అధికారులు ఇంటింటికి సర్వే చేపట్టగా... పారిశుద్ధ్య సిబ్బంది క్రిమి సంహారక మందును పిచికారి చేశారు.

ఎలా సోకిందంటే....?

సదరు బాలుడు బధిరుడు. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా కేంద్రంలో బధిరులకు ఉచిత శస్త్రచికిత్స చేస్తున్నారని తెలుసుకుని లాక్​డౌన్​కు ముందు అక్కడికి వెళ్లారు. శస్త్ర చికిత్స పూర్తయినా... లాక్​డౌన్​ వల్ల అక్కడే చిక్కుకుపోయారు. లాక్​డౌన్​ను మే 3 వరకు పొడిగించగా.. గుంటూరు నుంచి అంబులెన్స్ మాట్లాడుకుని ఈ నెల 14న గ్రామానికి చేరుకున్నారు.

గ్రామస్థులు వైద్య సిబ్బందికి సమాచారమివ్వగా జగిత్యాల జిల్లా ఆస్పత్రిలో బాలుడిని, కుటుంబసభ్యులను ఐసోలేషన్​లో ఉంచి నమూనాలను పరీక్షలకు పంపారు. బాలునికి పాజిటివ్​ రాగా కుటుంబీకులకు నెగిటివ్​ వచ్చింది.

జిల్లాలో మూడో కరోనా కేసు

దిల్లీ మర్కజ్​ వెళ్లి వచ్చిన వారు గత నెలలో ఇద్దరికి పాజిటివ్​ రాగా.. వారితో సంబంధం ఉన్నవారిని హోం క్వారంటైన్​కు తరలించారు. తాజాగా బాలుడికి వ్యాధి నిర్ధరణ కాగా జిల్లాలో మూడో కేసు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఇతర జిల్లా నుంచి వచ్చే వారిపై నిఘా పెంచాలని జిల్లా కలెక్టర్ గుగులోతు రవి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా సరిహద్దుల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇదీ చదవండిః ఈటీవీ కథనానికి స్పందన.. బుడగ జంగాల కూలీలకు సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.