కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. పట్టణంలోని ఓంకారేశ్వర ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు గోధుమ పిండితో తయారు చేసిన ప్రమిదల్లో దీపారాధన చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చదవండి:వంట గదిలోని పొగ పీల్చితే గుండెపోటు!