అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాలలో మహిళా దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులు, మహిళా ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొన్నారు. జగిత్యాల కలెక్టర్ కార్యాలయం నుంచి మహిళా ఉద్యోగులు ర్యాలీగా స్థానిక వీకేబీ కల్యాణ మండపం వరకు వెళ్లారు.
అనంతరం నిర్వహించిన వేడుకలకు జిల్లా కలెక్టర్ గుగులోతు రవి, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ వేడుకల్లో యూట్యూబర్ గంగవ్వ, సరితలను జిల్లా పాలనాధికారి రవి సత్కరించారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని జగిత్యాల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత, జిల్లా కలెక్టర్ గుగులోతు రవి పేర్కొన్నారు.