అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఓ వైపు ప్రాజెక్టులు వర్షాలకు ఉప్పొంగుతుంటే.. వంతెనలు కూలిపోతున్నాయి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం.. ధర్మాజీపేటలో వరద ఉద్ధృతికి వంతెన కూలిపోయింది. అందరూ చూస్తుండగానే... ఒక్కసారిగా వరద పోటెత్తడంతో పాతబడిన వంతెన కొట్టుకుపోయింది. స్థానికులు తమ ఫోన్లలో ఈ దృశ్యాన్ని చిత్రీకరించారు.
సంబంధిత కథనాలు: