పచ్చని చెట్లు.. నిండుగా ఉన్న చెరువులతో జగిత్యాల జిల్లా ముగ్ధమనోహరంగా మారింది. దట్టమైన వృక్షాలతో పచ్చదనాన్ని పరుచుకున్న సారంగాపూర్ అడవి ప్రకృతి ప్రేమికులను మైమరపిస్తోంది.
చుట్టుపక్కల భారీ వృక్షాలతో అటవీ మార్గంలో వొంపులు తిరుగుతూ ఉన్న రహదారి ఆవైపు వెళ్లే ప్రయాణికులకు కనువిందు చేస్తోంది. పచ్చదనంతో విరబూసిన ఈ అటవీ ప్రాంతంలో కాసేపు సేదతీరేందుకు వచ్చే ప్రకృతి ప్రేమికులు ఆహ్లాదాన్ని పొందుతున్నారు.