ETV Bharat / state

మెట్​పల్లిలో భాజపా, తెరాస బాహాబాహీ

రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణపై జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ భాజపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. మెట్​పల్లి పాత బస్టాండ్​ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. ఇదే సమయంలో అక్కడికి తెరాస నాయకులు రావటంతో గొడవ జరిగింది.

tension situation at metpally in jagityal district
మెట్​పల్లిలో భాజపా, తెరాస బాహాబాహీ
author img

By

Published : Jan 21, 2021, 5:42 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో భాజపా, తెరాస శ్రేణులు బాహాబాహీకి దిగాయి. రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణపై జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన వివాదస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ భాజపా నాయకులు పాత బస్టాండ్​ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. ఇదే సమయంలో తెరాస నాయకులు కూడా పాత బస్టాండ్ కు చేరుకోవటంతో ఒకరికొకరు వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు.

మాటామాట పెరిగి నెట్టుకున్నారు. పోలీసులు బందోబస్తు కోసం ఏర్పాటు చేసుకున్న బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అక్కడికి చేరుకున్న పోలీసులు.. నచ్చజెప్పినా వారు వినిపించుకోలేదు.

మెట్​పల్లిలో భాజపా, తెరాస బాహాబాహీ

ఇదీ చదవండి: 'రామమందిర విరాళాలపై ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.