జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం నిర్వహించారు. ఐదో రోజు వేలాది భక్తుల మధ్య ఈ ఉత్సవం కన్నులపండువగా జరిగింది. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలు, గోవింద నామస్మరణతో రథాన్ని లాగుతూ ఆలయ ప్రాంగణంలో తిప్పారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలతో పాటు భక్తుల లక్ష్మీనరసింహస్వామి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది.
భక్తులు కొబ్బరికాయలు, మెుక్కులతో రథం వద్ద స్వామి వారిని ప్రసన్నం చేసుకునేందుకు పోటీపడ్డారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయంలోకి తీసుకెళ్లి వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు.
ఇవీ చూడండి: మాఘమాసంలో చేయాల్సిన పనులు ఏంటంటే?