షిరిడీ సాయిబాబా పుణ్యతిథిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కోరుట్లలోని సాయి ఆలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు బాబాకి ప్రత్యేక అభిషేకాలు చేశారు. వివిధ పుష్పాలతో అలంకరించి సాయిబాబాను సుందరంగా అలంకరించారు.
ఈ వేడుకల్లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు పాల్గొని సాయికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. బాబా దర్శనం కోసం వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. భజన మండలి వారు సాయిబాబా పాటలు పాడుతూ భక్తి భావాన్ని చాటారు.
ఇదీ చూడండి: యాదాద్రిలో ఘనంగా జమ్మి పూజ, ఆయుధ పూజలు