మహా శివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుల దర్శనం కోసం ఆర్టీసీ అదనపు బస్సులు ఏర్పాటు చేసింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి నుంచి వేములవాడకు భక్తులు ప్రత్యేక బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.
తెల్లవారుజాము నుంచే భక్తులు వివిధ గ్రామాల నుంచి మెట్పల్లి ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని ప్రత్యేక బస్సుల్లో రాజన్న దర్శనం కోసం వేములవాడ వెళుతున్నారు. భక్తులతో బస్టాండ్ ప్రాంగణమంతా కిటకిటలాడింది.
ఇవీ చూడండి: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు