అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలంటూ జగిత్యాల ఎస్పీ కార్యాలయం ఎదుట రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలంటూ డిమాండ్ చేశారు. ఇటిక్యాలలోని పెద్ద వాగు నుంచి ప్రతిరోజు అక్రమంగా ఇసుకను తరలిస్తుండం వల్ల భూగర్భ జలాలు నిల్వ ఉండట్లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తరలించే ట్రాక్టర్లతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదన్నారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని జిల్లా ఎస్పీ సింధూ శర్మకు వినతిపత్రం అందజేశారు.
'ఎస్పీ గారూ!! అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోండి'
జగిత్యాల జిల్లాలో అక్రమ ఇసుక రవాణా వల్ల భూగర్భ జలాలు నిల్వ ఉండట్లేదని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.