ETV Bharat / state

ఉపసర్పంచి భర్తపై.. సర్పంచి భర్త దాడి - jagityal district news

గ్రామ అభివృద్ధి పనుల కోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్​ను సర్పంచ్​ భర్త సొంత అవసరాలకు వాడుకుంటున్నారని పలువురు వీడియో తీశారు. ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘటనలో మాపై ఎందుకు ఫిర్యాదు చేశారంటూ ఉపసర్పంచ్​ భర్తపై దాడి చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.

Sarpanch's husband attacked at jagtial district
ఉపసర్పంచి భర్తపై.. సర్పంచి భర్త దాడి
author img

By

Published : Jan 25, 2020, 12:02 AM IST

గ్రామ పంచాయతీ అవసరాల కోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్‌ను సొంత అవసరాలకు వాడుకుంటున్నారని ప్రశ్నించినందుకు ఉపసర్పంచి భర్తపై సర్పంచి భర్త దాడి చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేటలో చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ను సొంత అవసరాలకు ఉపయోగిస్తున్నారని పలువురు వీడియో తీసి ఎం​పీడీఓకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో దమ్మన్నపేట సర్పంచి భర్త చంద్రయ్య, అతని బంధువులు కలిసి ఉపసర్పంచ్​ భర్త కొమురవెల్లిపై దాడికి పాల్పడ్డారు. ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని బాధితుడు కొమురవెల్లి ఆవేదన వ్యక్తం చేశాడు. గాయపడ్డ బాధితుడు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై గొల్లపల్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఉపసర్పంచి భర్తపై.. సర్పంచి భర్త దాడి

ఇదీ చూడండి : మంత్రి గంగుల నిబంధన ఉల్లంఘించారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

Intro:Body:

ss

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.