జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల ప్రాణాలు పోతున్నా.. సర్కారుకు పట్టింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న.. తెరాస ఇప్పుడు వారినే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సర్కారు దిగివచ్చి కార్మికులతో చర్చలు నిర్వహించాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: ప్రజలు ఇబ్బంది పడుతున్నారు... సమస్య పరిష్కరించండి..!