ఇవీ చూడండి:వైభవంగా రథోత్సవం
కన్నుల పండవగా రథోత్సవం
రాష్ట్రంలో శివరాత్రి ముగింపు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా దుబ్బరాజన్న ఆలయంలో ఉత్సవ మూర్తులకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావటంతో పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.
సారంగాపూర్లో రథంపై ఉరేగుతున్న ఉత్సవమూర్తులు
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దుబ్బరాజన్న ఆలయంలో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామి వారి రథోత్సవం కన్నుల పండవగా సాగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామి వారు రథంపై ఊరేగారు. అంతకు ముందు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. వేడుక సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి:వైభవంగా రథోత్సవం
sample description