అయోధ్యలో శ్రీరామ మందిర ఆలయ నిర్మాణ భూమిపూజ సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి సీతారాముల ఆలయంలో శ్రీరామనామ జపం మార్మోగింది. ఆలయంలోని భక్తులు రామనామాన్ని భక్తితో పఠించారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మందిని ఆలయంలోనికి రాకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.
నియోజకవర్గ ఇన్ఛార్జి డా. వెంకట్.. సీతారాములకు పట్టువస్త్రాలతో పాటు పూలహారాలు సమర్పించారు. తన నివాసం నుంచి కోదండ రామాలయం వరకు నామజపం చేస్తూ ఆలయానికి వెళ్లారు. అనంతరం అర్చకులు.. స్వామివారికి పంచామృత అభిషేకించారు. వివిధ పుష్పాలతో స్వామిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.