ETV Bharat / state

జగిత్యాల టూ నిజామాబాద్ రైల్వేలైన్ ఆధునీకరణ పనుల పరిశీలన - తెలంగాణ వార్తలు

జగిత్యాల నుంచి నిజామాబాద్ వరకు ఆధునీకరించిన రైల్వేలైన్ పనులను అధికారులు పరిశీలించారు. పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతులపై ఆరా తీశారు. జగిత్యాలలోని లింగంపేట రైల్వే స్టేషన్‌తో పాటు కోరుట్ల, మెట్‌పల్లి రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేశారు.

railway officers inspection on railway line works from jagtial to nizamabad
జగిత్యాల టూ నిజామాబాద్ రైల్వేలైన్ ఆధునీకరణ పనుల పరిశీలన
author img

By

Published : Mar 12, 2021, 4:01 PM IST

జగిత్యాల నుంచి నిజామాబాద్ రైల్వేలైన్‌లో ఆధునీకరించిన విద్యుత్ లైన్ల తనిఖీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ వరకు పూర్తి చేయడంతో... జగిత్యాల నుంచి మోర్తాడ్ వరకు పూర్తైన పనులను పరిశీలించారు. జగిత్యాలలోని లింగంపేట రైల్వే స్టేషన్‌తో పాటు కోరుట్ల, మెట్‌పల్లి రైల్వే స్టేషన్లను పరిశీలించి... వివరాలు తెలుసుకున్నారు. మౌలిక వసతులపై ఆరా తీశారు.

అనంతరం మెట్‌పల్లి నుంచి మోర్తాడ్ వరకు వెళ్తూ మార్గంమధ్యలో పనులను పరిశీలించారు. ప్రస్తుతం నిజామాబాద్ వరకు ఆధునీకరణ పూర్తవగా... పెద్దపల్లి నుంచి నిజామాబాద్ వరకు 178 కిలోమీటర్లు అందుబాటులోకి రానుంది. మరిన్ని ఎక్స్‌ప్రెస్‌, సూపర్ ఫాస్ట్ రైళ్లు ఈ మార్గం గుండా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ గుండా నడిచే కొన్ని రైళ్లను కాజీపేట్-పెద్దపల్లి- నిజామాబాద్ మీదుగా నడిపించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: శివరాత్రి పూట రేవ్​పార్టీ... పోలీసుల అదుపులో 90 మంది..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.