ETV Bharat / state

అకాల వర్షం.. 200 ఎకరాల్లో పంట నష్టం.. - jagtial district latest news today

అకాల వర్షం అన్నదాతకు నష్టాన్ని మిగిల్చింది. జగిత్యాల జిల్లాలో ఈరోజు పలు మండాలల్లో కురిసిన వర్షానికి సుమారు 200 ఎకరాల్లో మొక్కజొన్న, నువ్వుల పంట నేలవాలింది. ఆరబోసిన పసుపు సైతం తడిసిపోయింది.

Premature rain Crop loss in 200 acres in jagtial district
అకాల వర్షం.. 200 ఎకరాల్లో పంట నష్టం
author img

By

Published : Mar 12, 2020, 9:16 PM IST

జగిత్యాల జిల్లాలో ఈరోజు కురిసిన అకాల వర్షంతో అన్నదాతలకు తీవ్ర పంట నష్టం జరిగింది. జగిత్యాల, రాయికల్ మండలాల్లోని మోరపెల్లి, అల్లీపూర్, సింగరావు పేట గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లో మొక్కజొన్న, నువ్వుల పంటకు నష్టం వాటిల్లింది.

ఉడుకబెట్టి ఆరబోసిన పసుపు తడిసిపోయింది. గాలితో కూడిన రాళ్లవాన కురవడం వల్ల చేతికొచ్చిన పంట నేల వాలింది. మరో వారం రోజుల్లో కోతకు వచ్చే మొక్కజొన్న పడిపోయింది. ఏపుగా పెరిగిన నువ్వుల పంట నేలకొరిగింది. పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

అకాల వర్షం.. 200 ఎకరాల్లో పంట నష్టం

ఇదీ చూడండి : మెట్​పల్లిలో భారీ వర్షం.. తడిసిన పసుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.