ఈ నెల 24న జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరగనున్న గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరగోపాల్ కోరారు. కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో ఆవిష్కరించారు. పవిత్ర గోదావరి మహా హారతికి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. భక్తులు హారతిలో పాల్గొని స్వామి ఆశీస్సులను పొందాలని కోరారు.
ఇదీ చూడండి : దివ్య శోభల యాదాద్రి - తుది దశకు పనులు