కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం పోలీసులు ఎంతో నిబద్ధతతో తమ విధులను నిర్వహిస్తున్నారు. జగిత్యాలలో లాక్‌డౌన్‌ను పోలీసులు పగడ్బందీగా అమలుచేస్తున్నారు. అనవసరంగా రోడ్లపై తిరిగే యువకులపై పోలీసులు లాఠీలు ఝళిపిస్తున్నారు.
పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తాలో కొందరు యువకులు ఎంత హెచ్చరించినా పదేపదే రోడ్లపై తిరగటం వల్ల పోలీసులు వారి లాఠీలకు పని చెప్పారు. అవసరముంటేనే బయటకి రావాలని అనవసరంగా రోడ్లపైకి ఎవరు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందలేదు: ఈటల