ETV Bharat / state

కొండగట్టు ఆలయం చోరీ కేసు.. దొంగలను పట్టించిన బీరు సీసా

Three Arrested in Theft at Anjanna Temple in Kondagattu: జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో చోరీకి పాల్పడ్డ ముగ్గురు దొంగలను జగిత్యాల పోలీసులు పట్టుకున్నారు. కేసు విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండుసార్లు రెక్కి నిర్వహించిన దొంగలు.. చివరకు వెండి అభరణాలను ఎత్తుకెళ్లగా, వారిని ఓ బీరు సీసా పట్టించింది.

KONDA-GATTU
KONDA-GATTU
author img

By

Published : Mar 2, 2023, 12:07 PM IST

కొండగట్టు ఆలయం చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్.. దొంగలను పట్టించిన ఓ బీరు సీసా

Three arrested in theft at Anjanna temple in Kondagattu: కొండగట్టు అంజన్న ఆలయంలో గత నెల 23 అర్థరాత్రి చొరబడిన దొంగలు.. 15 కిలోల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. శఠగోపం, వెండి గొడుగు వెండి రామ రక్ష ఇలా వివిధ రకాల వస్తువులు అందులో ఉన్నాయి. కేసును సవాలుగా తీసుకున్న జగిత్యాల పోలీసులు.. సాంకేతికతో చాకచాక్యంగా చోరులను పట్టుకున్నారు.

Theft in Kondagattu Anjanna Temple: చోరీకి ముందే దొంగలు రెండుసార్లు రెక్కి నిర్వహించారు. గత నెలలో సీఎం కేసీఆర్‌ ఆలయానికి రాగా, అంతకు ముందే ఒకసారి రెక్కి నిర్వహించి వెళ్లారు. మొదట అనుకూలంగా లేక పోవటంతో, మళ్లీ గత నెల 22న పసుపు రంగు దుస్తుల్లో భక్తుల రూపంలో వచ్చి రెక్కి నిర్వహించారు. 23వ తేదీన అర్ధరాత్రి దాటాక ఆలయంలో చొరబడ్డ దొంగలు.. 15 కిలోల వెండి అభరణాలు అపహరించుపోయారు. చోరీ పూర్తయ్యాక.. తీరిగ్గా ఆలయం వెనకాల బీర్లు తాగి అక్కడే పడేశారు.

ఆ బీరు సీసానే దొంగలను పట్టించింది. డాగ్‌ స్కాడ్‌తో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాబిన్‌ అనే జాగిలం.. దొంగలు తాగి పడేసిన బీరు సీసా వద్దకు వెళ్లి ఆగింది. బీరు సీసాపై ఉన్న వేలి ముద్రల ఆధారంగా ఆధునిక సాంకేతికతో, నిందితుని ఆధార్‌ను గుర్తించగలిగారు. కర్ణాటక బీదర్‌లో ఉన్న నిందితుల్ని 10 బృందాలుగా వెళ్లి పట్టుకున్నారు. ముగ్గురు పట్టుబడగా, పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు జగిత్యాల ఎస్పీ భాస్కర్‌ తెలిపారు.

దర్యాప్తులో కీలకమైన సాక్ష్యం అందించిన జాగిలం రాబిన్‌కు ఎస్పీ థ్యాంక్యూ చెప్పారు. ఆలయాలను లక్ష్యంగా చేసుకుని అందులోనూ వెండి వస్తువులనే దొంగిలించడం ఈ ముఠా ప్రత్యేకత. కొండగట్టు అంజన్న హుండిలో కోటికిపైగా నగదు ఉన్నా, అటు వైపుచూడని దొంగలు.. కేవలం వెండి వస్తువులనే పట్టుకెళ్లారు.

'జిల్లా స్థాయిలో దాదాపు పది బృందాలను ఏర్పాటు చేసి, శాస్త్ర సంకేతిక ఆధారాల ద్వారా 14 గంటలలోనే దొంగలను గుర్తించడం జరిగింది. వారు దేవాలయంలోనే దొంగతనం చేశారు. ఈ నేరం జరగడానికి ఒక రోజు ముందు కొండగట్టు అంజన్న ఆలయంలోనికి వారు రావడం జరిగింది. భక్తులు ఏ విధంగా అయితే ఉంటారో, ఆ విధంగా వారు రావడం జరిగింది. వచ్చి ఎక్కడ ఏం ఉంటాయో అన్ని పరిశీలించడం జరిగింది'. -భాస్కర్, జగిత్యాల ఎస్పీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.