ETV Bharat / state

గోపాల్​రావుపేట రేషన్​ బియ్యం పట్టివేత - jagityala district latest news

పేదలకు అందాల్సిన రేషన్​ బియ్యం పక్కదారి పడుతున్నాయి. జగిత్యాల జిల్లా గోపాల్​రావుపేట రైల్వే ట్రాక్ సమీపంలో 70 క్వింటాళ్ల పీడీఎఫ్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

police catch ration rice at gopal raopeta in jagityala district
గోపాల్​రావుపేట రేషన్​ బియ్యం పట్టివేత
author img

By

Published : Mar 15, 2020, 11:13 PM IST

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గోపాల్​రావుపేట రైల్వే ట్రాక్ సమీపంలో 70 క్వింటాళ్ల పీడీఎఫ్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఓ రైతు పొలం వద్ద గడ్డి కుప్పలో దాచి ఉంచారని పక్కా సమాచారంతో స్పెషల్ బ్రాంచ్​తో పాటు కొడిమ్యాల పోలీసులు వెళ్లి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

గ్రామాల్లో పది రూపాయలకు కిలో చొప్పున కొనుగోలు చేసి మహారాష్ట్రలోని నాందేడ్, సోలాపూర్ తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని గడ్డిలోంచి బయటికి తీసి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

గోపాల్​రావుపేట రేషన్​ బియ్యం పట్టివేత

ఇదీ చూడండి: 'ఆ ఇద్దరిలో ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.