పోచమ్మ తల్లి బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలో మహిళలు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఐదేళ్లకోకసారి జరిగే ఉత్సవాల్లో భాగంగా గౌడసంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.
మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు బోనాలతో తరలి రావడంతో గ్రామంలో సందడి నెలకొంది.
ఇదీ చూడండి : తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం.. పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై చర్చ