ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 45వ రోజూ కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
45 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం కార్మికులపై కనికరం చూపడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
ఇదీ చూడండి: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డే ప్రమాణం