ETV Bharat / state

మంత్రి పదవి కోసమే ఆ మాటలు: ఎంపీ అర్వింద్ - గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించిన ఎంపీ ధర్మపురి అర్వింద్

మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని.. ప్రజలు ఆలోచించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో జరిగిన ఘర్షణలో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించిన అనంతరం.. మీడియా సమావేశంలో ప్రసంగించారు.

Nizamabad MP Dharmapuri Arvind visits activists injured in clash at Jagtial District MetPalli two days ago
మంత్రి పదవి కోసమే ఆ మాటలు: ఎంపీ ధర్మపురి అర్వింద్
author img

By

Published : Jan 23, 2021, 8:00 PM IST

త్వరలో కొత్త సీఎం వస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన దృష్టిలో పడితే మంత్రి పదవి వస్తుందని.. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు రామ మందిరంపై దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో జరిగిన ఘర్షణలో గాయపడ్డ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. ముందు అయోధ్య రామమందిర చరిత్రను తెలుసుకుని మాట్లాడాలని విద్యాసాగర్ రావుకు హితవు పలికారు.

మంత్రి పదవి కోసమే ఆ మాటలు: ఎంపీ ధర్మపురి అర్వింద్

రామమందిర నిర్మాణానికి మాకు ఎవరూ చందా బుక్కులు ఇవ్వలేదని.. నిధి సేకరణ కోసం ప్రత్యేకంగా ఏర్పడిన ట్రస్ట్ వారితో కలిసి తాము తిరుగుతున్నామని ఎంపీ స్పష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తున్నారని ముందు ఈ విషయాన్ని ఎమ్మెల్యే తెలుసుకోవాలని అన్నారు. మందిర నిర్మాణంపై ఎమ్మెల్యే మాట్లాడిన మాటలకు తెరాసలో ఉన్న చాలా మంది హిందువులు బయటకు వస్తున్నారని.. మిగతా వారూ ఆలోచించన చేయాలని ఎంపీ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రిజిస్టర్డ్ మొబైల్ నంబర్​తో ఓటరు గుర్తింపు కార్డు డౌన్​లోడ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.